శీతాకాలం చాలామంది ఉదయాన్నే లేవడానికి ఇష్టపడరు. అలాగే చల్లని పదార్థాలకు దూరంగా ఉంటారు. గతంలో తరచూ చన్నీళ్ళ స్నానం చేసే వారు కూడా చలికాలం వచ్చే సరికి వేడినిటీ స్నానానికే అధిక ప్రదాన్యం ఇస్తూ ఉంటారు. అయితే కొందరికి చన్నీటి స్నానం చేయడం అలవాటుగా ఉంటుంది. అలాంటి వారు చాలాకాలంలోనైనా చన్నీటి స్నానమే చేస్తూ ఉంటారు. అయితే ఈ చలికాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకోవడం వల్ల.. వాతావరణ మార్పులు చేటు చేసుకుంటాయి. అందువల్ల శీతాకాలం లో చన్నీటి స్నానం చేయడం వల్ల మన శరీరంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ఈ చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల వచ్చే అనర్ధాల గురించి తెలుసుకుందాం !
ఎముకలు కోరితే ఈ చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అధికంగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బయటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థితిలో ఉండడంతో మన శరీర టెంపరేచర్ కూడా మార్పు చోటు చేసుకుంటుంది. అలాంటి సమయంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఒక్కసారిగా శరీర ఉష్ణోగ్రతలు అమాంతంగా తగ్గి బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇంక కొన్ని సందర్భాల్లో హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికి.. వాతావరణ మార్పుల కారణంగా శీతాకాలంలో ఈ సమస్యలు త్వరగా అటాక్ అయ్యే అవకాశం ఉంది.
ఇక చలికాలంలో తరచూ చన్నీటి స్నానం చేయడం వల్ల తిమ్మిర్లు, కళ్ళు మసకబారడం, తీవ్రమైన తలనొప్పి, మాటలు తడబడడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందువల్ల ఈ చలికాలంలో వీలైనంత వరకు చన్నీటి స్నానానికి దూరంగా ఉండాలని సూచిస్తూ, గోరు వచ్చని నీటితో ఈ చలికాలంలో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read:TTD:డయల్ యువర్ ఈవో