హిరణ్యకశ్యప నుండి గుణశేఖర్ అవుట్

247
- Advertisement -

హిరణ్యకశ్యప రానా కెరీర్‌లో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా చెప్పబడింది. 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. దర్శకుడు గుణశేఖర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా వర్క్ చేశాడు. అయితే ఆ ప్రాజెక్ట్ కుదరకపోవడంతో శకుంతలానికి వెళ్లిపోయాడు.

గుణశేఖర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “హిరణ్యకశ్యప అయితే కచ్చితంగా మరొక దర్శకుడితో జరుగుతుంది. పని జరుగుతోంది. చాలా పెద్ద దర్శకుడితో ఇది జరుగుతుంది” అని అన్నారు. అయితే అంతకుమించి ఎలాంటి వివరాలను సురేష్ బాబు వెల్లడించలేదు. కాబట్టి, ఈ ప్రాజెక్ట్ ఎలా రూపొందుతుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఆ పెద్ద డైరెక్టర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేసే దర్శకుడెవరో? తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -