ఆ హీరో 2023లో ఏకంగా 20 చిత్రాల్లో..

108
- Advertisement -

హీరోగా, దర్శకుడిగా, విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఏ హీరో అయిన ఏడాదికి ఒకటి లేదా రెండు.. ఇంకా మహా అంటే పది సినిమాలు చేస్తారు. కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం 2023లో ఏకంగా 12 సినిమాలు, 8 వెబ్ సిరీస్ లు ఇలా అన్నీ కలిపి ఏకంగా 20 వాటిల్లో పృథ్వీరాజ్ నటించనున్నాడు. ప్రస్తుతం ఈ టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

పైగా పృథ్వీ ‘బడేమియా ఛోటేమియా’ అనే హిందీ సినిమాలో విలన్ పాత్ర చెయనున్నాడు. మొత్తానికి మలయాళ స్టార్ హీరో బాలీవుడ్ ఎంట్రీ అంటూ ఈ వార్త వైరల్ అవుతుంది. మలయాళంతో పాటు తమిళంలో కూడా మంచి పాపులారిటీ ఉన్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. అందుకే పృథ్వీరాజ్ కోసం మేకర్స్ ఎదురుచూపులు చూస్తున్నారు.

పైగా పృథ్వీరాజ్ ఇటు కథానాయకుడిగా నటిస్తూనే.. అటు దర్శకుడిగానూ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడు. అందుకే, పృథ్వీరాజ్ సుకుమారన్ తీసిన సినిమాలు ఇతర భాషల్లో రిలీజ్ అవ్వడానికి క్యూలు కడుతున్నాయి. ఎంతైనా పృథ్వీరాజ్ సుకుమారన్ చేసే సినిమాలన్నీ స్టెలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చాలా బాగా అలరిస్తాయి.

ఇవి కూడా చదవండి…

అవతార్‌-2 అడ్వాన్స్ రికార్డు….

డిసెంబర్‌ 12న…రవితేజ ఫస్ట్‌లుక్‌

బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కి హీరోలు లేరా ?

- Advertisement -