గాయాలకే గాయమైన ఆటగాళ్లు…

1249
- Advertisement -

ఆటగాళ్లకు గాయాలు కావడం కామన్. కానీ ఆ గాయాల వల్ల ఆటకు దూరమవుతారు. కొన్ని సందర్భాల్లో ఆట మధ్యలో దెబ్బలు తగిలితే ఆటను కొనసాగిస్తారా లేదా అనేది వాళ్లిష్టం. కానీ క్రికెట్‌లో మాత్రం గాయాలు తగిలిన ఆటగాళ్లు గాయాలతోనే మ్యాచ్‌ను కొనసాగించి చివరి వరకు ఆటను ఆడి గెలుస్తారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతాయి. ఇప్పటివరకు క్రికెట్‌ చరిత్రలో ఆరుదుగా జరిగి ఆటను గెలిపించిన గాయాల ఆటగాళ్లు వీళ్లే..అనిల్ కుంబ్లే మార్షల్, మహేంద్ర సింగ్ ధోని, గ్రేమ్ స్మిత్‌, శిఖర్ ధావన్, రోహిత్‌ శర్మ.

మార్షల్….1984లో హెడింగ్లీ టెస్టులో మార్షల్ బొటనవేలు విరిగిపోయింది. దీంతో ఒంటి చేత్తో బ్యాటింగ్ చేశాడు. పేసర్ జోయెల్ గార్నర్‌తో కలిసి బౌలింగ్ కూడా చేశారు. ఈయన దాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అతని బొటనవేలు విరిగిన 7/53 వికెట్లు తీశాడు.

అనిల్‌ కుంబ్లే…. 2002లో జరిగిన వెస్టిండీస్‌ మ్యాచ్‌లో అనిల్‌ కుంబ్లే గాయపడ్డారు. ఆంటిగ్వాలో జరుగుతున్న టెస్టుమ్యాచ్‌లో మెర్విన్ డిల్లాన్ విసిరిన బంతికి కుంబ్లే దవడ విరిగింది. కానీ ఆతను ఆటన మొండిగా కొనసాగించాడు. అంతేకాదు కీలకమైన బ్రయాన్‌లారా వికెట్ తీశారు. 14ఓవర్లు చేశాడు. మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు.

గ్రేమ్ స్మిత్…2009లో సిడ్నీ టెస్టులో మిచెల్ జాన్సన్ విసిరిన బంతి కొట్టపోయి చేతికి గాయం చేసుకున్నాడు గ్రేమ్‌ స్మిత్. అయితే అతను పదవ స్థానంలో మళ్లీ వచ్చి ఆటను కొనసాగించగా చివరి 10బంతులు మిగిలి ఉండగానే ఆవుటై పెవిలియన్‌కు చేరాడు.

మహేంద్ర సింగ్ ధోని…భారత్ జింబాబ్వే మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్లో చివరి గేమ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే ఇదే సందర్భంలో ధోని ఆవుట్‌ అయిన విధానం ఇప్పటికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. అతని హెల్మెట్‌ ఎగిరి వికెట్ల మీద పడటంతో వికెట్ బెల్‌ ఎగిరి ధోని కంటిని తాకింది. దీంతో తీవ్రమైన నొప్పితో బాధపడుతునే సెకండ్ ఇన్నింగ్‌ లో వికెట్ల వెనుకాల ఉండి మ్యాచ్‌ గెలిపించడంలో తనదైన పాత్రను పోషించాడు.

శిఖర్‌ ధావన్… 2019 ప్రపంచకప్‌లో భారత్‌ ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మ్యాచ్‌లో పాట్ కమిన్స్ వేసిన షార్ట్ బాల్‌ ఆడబోయి గ్లవ్స్‌ను తాకింది. దీంతో ఫిజియో వెంటనే అతనికి ప్రథమ చికిత్స చేశాడు. మళ్లీ తన మ్యాచ్‌ను పునఃప్రారంభించి ఆటను తిరిగి ఆస్వాదించాడు.

రోహిత్ శర్మ… బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల మ్యాచ్‌లో రెండో వన్డేలో ఫిల్డింగ్ చేస్తున్నప్పుడు చేతికి గాయం కావడంతో చివర్లో వచ్చి మెరుపు ఇన్నింగ్ ఆడాడు… చివరికి బంగ్లా గెలిచి సిరీస్‌ను కొల్పోయింది భారత్‌.

మ్యాచ్‌ ఫలితం ఏలా ఉన్నా గాయాల పాలై ఆటను ఆస్వాదించడం వీరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. కొన్ని సార్లు గెలిచిన ఓడిన మరోకరికి ఇన్సిపిరేషన్‌గా మిగిలిపోతుంది.

ఇవి కూడా చదవండి…

భారత్ చిత్తు..సిరీస్ బంగ్లా కైవసం

టీఆర్ఎస్‌ కాదు బీఆర్‌ఎస్‌..ఈసీ ఆమోదం

ఓపెనింగ్‌ కోసం ఆ నలుగురే పోటీ:యూవీ

- Advertisement -