దేశంలోనే నెంబర్ వన్ ” హైదరాబాద్ ” !

191
- Advertisement -

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా ఐటీ రంగంలో కే‌సి‌ఆర్ సర్కార్ చూపిస్తున్న చొరవ ఆయా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరబాద్ ను ఐటీ హబ్ గా మార్చడంలో ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ తనదైన ముద్ర వేస్తూ.. పెట్టుబడులను ఆకర్షించడంలో అమితంగా విజయం సాధించారు. ఒక విధంగా చెప్పాలంటే దేశంలొ ఏ సంస్థ పెట్టుబడులు పెట్టాలన్న హైదరబాద్ వైపు చూస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఆయా సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు.. ఇలా అన్నీ కూడా వాటి బ్రాంచ్ విస్తరణకు ముందుగా హైదరబాద్ వైపే చూస్తున్నాయి. .

ఇదే విషయాన్ని పలు సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భాగంగా ఒక్క హైదరబాద్ లోనే 8.2 మిలియన్ చదరపు అడుగులలో ఆయా సంస్థలకు చెందిన కొత్త ఆఫీస్ లు హైదరబాద్ లో ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆఫీస్ స్పేస్ విభాగంలో హైదరబాద్ దేశంలోనే నెంబర్ ఒన్ గా నిలిచింది. దేశంలో కొత్తగా వినియోగంలోకి వచ్చిన ఆఫీస్ స్పేస్ లలో మొత్తం 34% కంటే ఎక్కువ ఒక్క హైదరబాద్ లోనే విశేషం. దీంతో దేశంలోని టాప్ 7 సిటీస్ కంటే ముందు నిలిచింది. దేశంలోనే ఐటీ సిటీస్ గా పేరుగాంచిన బెంగళూరు, డిల్లీ వంటి సిటీస్ కూడా హైదరబాద్ తరువాతనే నిలిచాయి. బెంగళూరు 26 శాతం, డిల్లీ 21 శాతంతో హైదరబాద్ తరువాతి స్థానాలలో నిలిచాయి. దీన్ని బట్టి చూస్తే ఐటీ రంగంలో హైదరబాద్ ఏ స్థాయిలో దూసుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఇండియా వైపు చూస్తున్న బడా కంపెనీలకు హైదరబాద్ ఫస్ట్ ఆప్షన్ గా ఉందని, తాజా గణాంకాలతో మరోసారి నిరూపితం అయింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -