సిరిసిల్ల చేనేత కళలకు అమెరికా ఫిదా..

240
- Advertisement -

ఆసియా ఖండంలోని వివిధ దేశాల్లోని చేనేత నైపుణ్య  రంగాలపైన సమగ్రమైన అధ్యయనం చేస్తున్న అమెరికా ప్రభుత్వ పరిశోధన  చేనేత నిపుణురాలు (రిసెర్చ్‌ స్కాలర్‌)కైరా జాఫ్ ఈ రోజు తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఇప్పటికే పలు దేశాల్లో అధ్యయనం పూర్తి చేసుకొని భారతదేశంలోని తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ వంటి పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్న కైరా… తాజాగా సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు.

తెలంగాణలోని పోచంపల్లి, గద్వాల్, సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ వంటి ప్రాంతాల్లో పర్యటించిన కైరా…  సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో  తెలంగాణ చేనేత కార్మికుల నైపుణ్యంను చూసి మురిసిపోయారు. సిద్దిపేటలోని సెరికల్చర్‌ రైతులతో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకొని …సిరిసిల్లలోని నేతన్నలతో సమావేశమయ్యారు.

సిరిసిల్ల పట్టణంలో పలువురు చేనేత కార్మికులు మరమగ్గాలను, వారు నేస్తున్న బట్టలను మరియు చేనేత నైపుణ్యాలకు సంబంధించిన అంశాలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు మరమగ్గాలకు మళ్లిన విధానం గురించి ఆమె నేతన్నలను అడిగి  తెలుసుకున్నారు. చేనేత రంగంలో విభిన్నమైన ఉత్పత్తులతో యావత్తూ దేశాన్ని ఆకర్షించిన హరిప్రసాద్‌ను కలుసుకున్నారు. ఆయన రూపొందించిన వివిధ చేనేత ఉత్పత్తులను ముఖ్యంగా అగ్గిపెట్టెల్లో పట్టేలా నేసిన చీరను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆమె ఇంత గొప్ప నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను ఇంతవరకు తాను చూడలేదని కొనియాడారు.

టెక్స్‌టైల్స్‌ అధికారులు సిరిసిల్ల నేతన్నలకు అందించిన ప్రభుత్వ ప్రోత్సాహం గురించి వివరించారు. నేతన్నల ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షిచడానికి ప్రభుత్వం అందించిన సహాయం గురించి అధికారులు కైరాకు వివరించారు. చేనేత పరిశ్రమలు ఎదుర్కొంటున్న సంక్షోభం, దాని నుంచి బయటపడిన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. చేనేత కళలను ఏ విధంగా అధునికరించారో తెలుసుకున్నారు. ఈసందర్భంగా పవర్‌ లూమ్‌ యంత్రాల ద్వారా నేతన్నల కష్టాలు ప్రభుత్వం నిర్మూలించిన విధానంను అధికారులు కూలంకషంగా వివరించారు.

సిరిసిల్ల పట్టణం చేనేత కార్మికుల పవర్‌లూమ్ క్లస్టర్‌గా మారిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. చేనేత సంక్షోభం నుంచి నేతన్నలు స్వయం సమృద్ది వైపు సాగుతున్న విధానాన్ని గురించి ఆరా తీశారు.   క్షేత్ర స్థాయిలో సిరిసిల్ల నేతన్నల వివరాలను అడిగి తెలుసుకున్న కైరా బృందం… తెలంగాణ మరమగ్గాలు జౌళి అభివృద్ధి కార్పొరేషన్ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్‌ సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి, టెక్స్‌టైల్స్‌ అధికారులతో పాటు చేనేత నేత కార్మిక సంఘాల ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

భారత్‌…రెమిటెన్స్‌ వృద్ధిలో టాప్‌

ఇదే సరైన సమయం:హరీశ్‌ రావత్‌

రాష్ట్రానికే ఆదర్శంగా సిద్దిపేట..

- Advertisement -