వరల్డ్ కప్‌లో ఓటమి నుండి ఇంకా గుణపాఠం తెచ్చుకోలేదు భారత్. సీనియర్ ఆటగాళ్లున్నా బంగ్లాదేశ్‌పై చిత్తయ్యారు. బంగ్లా బౌలర్ల ధాటికి కేవలం 186 పరుగులకే చాపచుట్టేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ టాప్ ఆర్డర్ తేలిపోయింది. ఒక్క కేఎల్ రాహుల్ మినహా మిగితా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. దీంతో 41.2 ఓవర్లలో కేవలం 186 పరుగులకే ఆలౌట్ అయింది. రోహిత్ 27, ధావన్ 7, కోహ్లీ 9, శ్రేయాస్ 24, కేఎల్ రాహుల్ 73, వాషింగ్టన్ సుందర్ 19, షెహబాజ్ అహ్మద్ 0, శార్దూల్ ఠాకూర్ 2, దీపక్ చాహర్ 0, మొహమ్మద్ సిరాజ్ 9, కుల్దీప్ సేన్ 2(నాటౌట్) పరుగులు చేశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా మరో వికెట్ మిగిలిఉండగానే లక్ష్యాన్ని చేధించింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మెహిదీ హొస్సైన్ క్రీజులో పాతుకుపోయి 38 పరుగులు చేసి బంగ్లాదేశ్ జట్టును గెలిపించాడు. చివరి వికెట్‌కు ముస్తాఫిజుర్ రెహ్మాన్ 10తో కలిసి 51 పరుగులు జోడించారు.
సీనియర్ ఆటగాళ్లున్న భారత్ ఓటమి పాలవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జట్టు కూర్పు సరిగా లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..