నిర్మాతను బూతులు తిట్టిన హీరోయిన్

198
- Advertisement -

కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడటం కారణంగానే ఆమె స్టార్ హీరోయిన్ అయినా ఆమెకు ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి అని టాక్ ఉంది. అయినా, స్టార్ హీరోల పై నిర్మొహ‌మాటంగా మాట్లాడి… అన‌వ‌స‌రంగా ఫ్యాన్స్ నుంచి త‌ల నొప్పులు తెచ్చుకుంటూనే ఉంటుంది కంగనా రనౌత్.

ఆ మధ్య స్టార్ హీరో అమీర్ ఖాన్ పై బ్యాడ్ కామెంట్స్ చేసి తీవ్ర ఆగ్ర‌హానికి గురి అయింది. అయినా కంగనా రనౌత్ లో ఎలాంటి మార్పు లేదు. ఎప్పటికప్పుడు తన కామెంట్ల తీవ్రతను పెంచుతూనే పోతుంది. కొంతకాలం క్రితం బాలీవుడ్ లో హీరోల ఆధిపత్యం పై నోరు పారేసుకుంది. ఇన్ డైరెక్ట్ గా స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ పై కూడా కంగనా రనౌత్ కామెంట్స్ చేసింది. కంగనా రనౌత్ కి బాగా అహంకారం పెరిగిందంటూ షారుఖ్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు.

అసలు కంగనా రనౌత్ ను హిందీ సినిమాల‌ నుంచి బాయ్‌కాట్ చేయాల‌ని కూడా పిలుపునిచ్చారు. తాజాగా కంగనా రనౌత్ పై మరో రూమర్ వైరల్ అవుతుంది. ఆమె లేటెస్ట్ గా ఎమర్జెన్సీ అనే సినిమాలో నటిస్తోంది. పైగా ఈ సినిమాకి ఈమె డైరెక్టర్. మరి ఈ డైరెక్షన్ క్రమంలో ఏం జరిగిందో ఏమో గానీ.. ఈ సినిమా నిర్మాత రేణు పెట్టి పై కంగనా రనౌత్ సీరియస్ అయిందట. నిర్మాతను బూతులు తిడుతూ సెట్స్ నుంచి కూడా వెళ్లిపోయిందని కంగనా రనౌత్ గురించి ఒక పుకారు వైరల్ అవుతుంది. అయినా.. కాంట్రవర్సీ క్వీన్ గా పేరున్న కంగనా రనౌత్ నుంచి ఇలాంటి వార్తలు రావడం సహజం లేండి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -