తెలంగాణలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్టుబడులు పెట్టి స్థానిక యువతకు పెద్ద ఎత్తున్న ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. తాజాగా అమరరాజా గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. హబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ గల్లా జయదేవ్ అమరరాజా గ్రూప్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్న అమరరాజా గ్రూప్ సంస్థకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులకు ముందుకొచ్చిన జయదేవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సుమారు రూ. 9,500 కోట్ల పెట్టుబడులు రావడం గొప్ప విషయమన్నారు. అమరరాజా కంపెనీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. 37 ఏండ్లుగా అమరరాజా సేవలందిస్తోంది. పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని కేటీఆర్ ప్రకటించారు.
Yet another historic win for Telangana
Amara Raja to setup India's largest Lithium Ion Cell Manufacturing facility till date with an investment of ₹9,500 Cr, further reinforcing Telangana’s position as an ideal destination for EV and Advanced Cell Chemistry (ACC) Manufacturing. pic.twitter.com/z0h5BlwUyz
— KTR (@KTRTRS) December 2, 2022
ఇవి కూడా చదవండి…