ఆ హీరోయిన్ కార్య‌క్ర‌మాలు గొప్పవి

118
- Advertisement -

హీరోయిన్లు అంటే అందాల ఆరబోతే అనుకుంటారు. దీనికితోడు ఫలానా వారితో డేటింగ్‌, ఫలానా హీరోలతో ఇత‌ర‌త్రా ఎఫైర్స్ అంటూ వారి గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్లకు కూడా మంచి మనసు ఉంటుందని, వారిలో కూడా ఓ మదర్ థెరిస్సా ఉంటుందని చాలా మందికి తెలియదు. ప్రస్తుతం హీరోయిన్ ప్రణీత సుభాష్ సేవా కార్య‌క్ర‌మాల గురించే ఈ చ‌ర్చ అంతా.

ప్రణీత సుభాష్ గ్లామ‌ర్ కి ఎందరో అభిమానులు ఉండొచ్చు. కానీ, ఆమె మంచితనానికి కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. బెంగుళూరు స‌మీపంలోని ఓ స్లమ్ ప్రాంతంలో పేదవాళ్ల కోసం ప్రణీత సుభాష్ ఓ స్కూల్ న‌డిపిస్తున్నారు. ఈ విష‌యం చివ‌రికి ఆమె అభిమానుల‌కైనా ఎంత మందికి తెలుసు ?, తన ఛారిటీకి సంబంధించి ప్రణీత సుభాష్ ఎప్పుడు సీరియ‌స్ గా కామెంట్ చేయ‌లేదు.

కానీ, ప్రణీత సుభాష్ పేదల కోసం స్కూల్ న‌డుపుతార‌ని తెలిసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కొందరు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఏ మాత్రం స‌మ‌యం దొరికినా ప్రణీత సుభాష్ ఆ స్లమ్ ఏరియాకి వెళ్లి విద్యార్థుల‌తో గ‌డిపి వ‌స్తారు. అయితే, త‌న సేవా కార్య‌క్ర‌మాల గురించి ప్రణీత సుభాష్ ఎప్పుడూ ప్ర‌చారం చేసుకోరు. అదే ఆమె గొప్ప‌త‌నం.

ఇవి కూడా చదవండి…

రికార్డును తిరగరాసే అవకాశం…దృశ్యం-2!

పరుగులు పెడుతున్న చిరు , బాలయ్య

విక్కీ కౌశల్‌ హీరోగా సామ్‌ బహుదూర్‌

- Advertisement -