రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ నెల్లో జోరుగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. గత మూడునెలల నుంచి ఎప్పుడెప్పుడూ మూఢం పోతుందా…ముహూర్తాలు వస్తాయా అని ఎదురు చూసిన పెళ్లి కానీ యువకులు యువతులు డిసెంబర్‌లో ఒక్కటవబోతున్నారు. నవంబర్తో మూఢం పోతుండటంతో డిసెంబర్ నెల మొత్తం ముహూర్తాలు ఉండటంతో బాజాలు రెడీ చేసుకుంటున్నారు. దీంతో కల్యాణ మండపాలు ఈవెంట్ మేనేజర్లకీ గిరాకీ పెరిగింది.
డిసెంబరులో కూడా నాలుగైదు మాత్రమే మంచి ముహూర్తాలు ఉండడంతో వివాహాలు, రిసెప్షన్ వేడుకలతో మండపాలు కిక్కిరిసిపోనున్నాయి. సాధారణంగా ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాల్లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగతాయి.
డిసెంబరు 2 నుంచి 21 వరకే మంచి రోజులున్నాయి. ఆ తర్వాత పుష్యమాసం వస్తుంది. ఆ నెలంతా, అంటే జనవరి రెండో భాగం వరకు మంచి ముహూర్తాలు లేవు. అలాగని మరికొంత కాలం వేచి చూడాలని భావించినా.. 2023 ఫిబ్రవరి, మార్చి నెలల్లో మాఘ, ఫాల్గుణ మాసాల్లో కొద్ది సంఖ్యలోనే ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్‌లో అంటే ఉగాది తర్వాత చైత్రమాసంలో మళ్లీ మూఢం వస్తోంది. శుభ ముహూర్తాలు మేలో కానీ ఉండవు.
డిసెంబరులో అందుబాటులో ఉన్న కొన్ని ముహూర్తాల్లోనే ఎక్కువ మంది పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారని పండితులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే డిసెంబరు 20లోగా వేలాదిగా వివాహాలు జరగనున్నాయని ఈవెంట్ మేనేజ్‌మెంట్ వర్గాలు అంటున్నాయి. ఇక సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా పెళ్లిళ్లు జరుగనున్నాయట. ఇందుకోసం ఏకంగా రెండు లక్షల కోట్ల బిజినెస్ కూడా జరుగుతోందని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…
బీజేపీ వదిలిన బాణం..కవిత సెటైర్
సుప్రీంకోర్టును ఆశ్రయించిన బిల్కిస్…
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదా?

