ప్రోటీన్ల కోసం ఇవి తినండి…

229
- Advertisement -

మానవ శరీరానికి కావల్సిన శక్తిని ఇచ్చేది కేవలం రైస్‌ మాత్రమే కాదు. అంతకుమించి శరీరానికి కావాలి అని కోరుకుంటుంది. ప్రస్తుత బిజీ జీవితంలో సమయానికి ఆహారం తీసుకునే తీరిక లేకపోవడం చేత చాలామంది పోషకాహారలోపంతో జీవిస్తున్నారు. అటువంటి వారి కోసం వచ్చిన దివ్యౌషధం..మొలకెత్తిన గింజలు. చాలా మంది తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు.

రెడ్‌మీట్‌, చీజ్, యోగర్ట్‌, బర్గర్‌, ఫ్రై ఫుడ్స్‌ లాంటి ఆహారం తిన్నప్పుడు జీర్ణం చేసుకోవడానికి చాలా కష్టం. ముఖ్యంగా 45యేళ్లు దాటిన వారికి జీర్ణం చేసుకోవడం చాలా కష్టం..అటువంటి వారు తక్కువ ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అది ఎంటో చూసేద్దాం..

  1. మొలకెత్తిన విత్తనాల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ బరువు తగ్గడానికి అవసరం.
  2. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడం వేగవంతం అవుతుంది. వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. దీని వల్ల ఆకలి వేయదు. ఏదైనా తినాలి అన్న కోరిక రాదు.
  3. మొలకలను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. మీ రోజువారీ ఆహారంలో మొలకలను జోడించడం వలన మీ ఆహారం యొక్క పోషక విలువలను పెంచడంలో సహాయపడుతుంది.
  4. భోజనాల మధ్య చిరుతిండిగా కూడా మొలకలు తీసుకోవచ్చు. వాటిని సూప్‌లు, సలాడ్‌లలో చేర్చవచ్చు. సైడ్ డిష్‌గా తీసుకోవచ్చు.
  5. మొలకెత్తిన విత్తనాలు వాసన వస్తుంటే వాటిని తినకపోవడం మంచిది. లేదంటే వాటిని శుభ్రంగా కడిగి ఆవిరిపై కొద్దిసేపు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా ఉడికించడం వల్ల మొలకలు సులభంగా జీర్ణం అవుతాయి. వాటిలోని పోషకాలు కూడా తొలగిపోవు.
  6. మొలకెత్తిన గింజలు తింటుంటే వాటిని రోటీ లేదా అన్నంతో కలిపి తినండి. ముఖ్యంగా రాత్రవేళ చిక్‌పీ లేదా రాజ్మా వంటివి తినకూడదు.
  7. రాత్రిపూట భోజనాన్ని మితంగా తినాలి. లేదంటే దాని ద్వారా సరిగా నిద్ర పట్టదు. అందువల్ల సులభంగ జీర్ణమయ్యే మొలకలను తీసుకోవడం ఉత్తమం.
  8. మొలకలు జీర్ణం కావడానికి కొంచెం టైంపడుతుంది. కాబట్టి వాటిని ఉడకించి తినడం మంచింది. కొన్ని సార్లు పచ్చిగా తిన్న పరువాలేదు. కానీ దాని ద్వారా జీర్ణాశయంలో బ్యాక్టీరియా చేరి ఫుడ్‌ పాయిజన్‌ జరుగుతుంది.

 Also Read: Sree Leela:ఆ దర్శకుడికి హ్యాండ్ ఇచ్చింది

- Advertisement -