చీకటి చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా…

266
- Advertisement -

దేశవ్యాప్తంగా విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎంప్లాయిస్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న విద్యుత్‌ ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో హాజరైనారు. విద్యుత్ ఉద్యోగు ఆందోళనకు మద్దతు తెలిపిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ తీసుకువచ్చిన అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రాల మీద పెను భారం పడుతుందన్నారు. దీన్ని వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు అంతిమంగా ప్రజలపై భారంపై పడుతుందని మండిపడుతున్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తే సామాన్యప్రజలు తీవ్రస్థాయిలో నష్టపోతారని దీని వల్ల నిత్యవసర ధరలు పెరుగుతాయని అన్నారు. విద్యుత్‌ చట్టాలను వెనక్కితీసుకోవాలని లేనియెడల పార్లమెంటును ముట్టడి చేస్తామని అన్నారు.

నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ స్టేట్ కన్వీనర్ రత్నాకర్‌రావు మాట్లాడుతూ… విద్యుత్‌ వినియోగదారులకు ఉద్యోగులకు నష్టం చేసే ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఇది అమలు జరిగితే రైతులు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున్న నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. విద్యుత్ వ్యవస్థను ప్రైవేటు పరం చేస్తే అధిక ధరలకు విద్యుత్ కొనాల్సి వస్తుందని దాని వల్ల రైతులపై భారం పడుతుందన్నారు.

తెలంగాణతో సహా 13రాష్ట్రాల సీఎంలు విద్యుత్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని సూచించిన కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడిన సంయుక్త కిసాన్ మోర్చాకు విద్యుత్ సవరణ బిల్లులు పెట్టమని కేంద్ర హామినిచ్చిందని అన్నారు. అయినా బిల్లులను తీసుకువస్తే తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. విద్యుత్‌ చట్టాలను అమోదిస్తే దేశం అంధకారమవుతుందని హెచ్చరించారు. దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -