ఆర్థిక సంక్షోభం వస్తే ఏం చేయాలి…

248
- Advertisement -

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తలేత్తె అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీనికి ప్రధాన కారణంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధమని పలువురు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి నోట ఒకే మాట వినిపిస్తోంది. ఆదే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టకండి..వీలైనంత వరకు సంపాదించింది దాచుకోండని పలువురు ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఐటీ రంగం దానిపై ఆదారపడిన ఎగుమతులు దిగుమతులపై ఆధిక భారం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ముందస్తూ ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచిస్తున్నారు. అనవసరమైన వాటిని కొనుగోలు చేసి అప్పుల పాలు కావొద్దని అంటున్నారు.

ఖర్చుల నియంత్రణ…

  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా లేదని.. మాంద్యం ముప్పు ముంచుకొస్తుందని.. అందుకు తగ్గట్లుగా ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
  • కార్లు, పెద్ద పెద్ద టీవీలు, ఫ్రిజ్‌లు కొనొద్దని జెఫ్ బెజోస్ చెబుతున్నాడు. క్రిస్మస్ ఫెస్టివల్ సీజన్‌లో.. డబ్బు ఖర్చు చేసుకోకుండా.. దాచుకోవాలని సూచిస్తున్నారు.
  • గొప్పలకు పోయి అవసరం లేనివన్నీ కొనేస్తే.. ఈఎంఐలు కట్టుకోలేక కష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • భారీ ఎత్తున్న కొనుగోలు చేయాలనుకుంటే వాటిని సాధ్యమైనంతవరకు వాయిదాలు వేయడం మంచింది.
  • ప్రస్తుతం వచ్చే జీతంలో కనీసం మూడవంతు నగదుగా వచ్చే మూడు నెలలపాటు మినిమం పొదుపుగా వాడుకునేలా ప్రణాళికలు వేసుకోవాలి.
  • జీతంను ముందస్తుగా ఖర్చులకోసం అనగా మెడికల్,  ఇంటి అవసరాలు, ఆహరం కోసం దాచుకునే ప్రయత్నం చేయాలి. ఆహారాన్ని వృథా చేయడం సాధ్యమైనంత వరకు మానుకోవాలని సూచిస్తున్నారు.
  • సాధ్యమైనంత వరకు.. ప్రజలు నగదుని తమ దగ్గరే ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
  • భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనవసర ఖర్చులకు ప్రజలకు దూరంగా ఉండాలన్నారు.
  • సేవింగ్స్‌ను ఎక్కువ మొత్తంలో దాచుకోవాలి.
  • ట్వీట్టర్,కూకో,మెటా,ప్రముఖ అంతర్జాతీయ మల్టీనేషనల్ సంస్థలు పెద్ద ఎత్తున్న తమ ఉద్యోగులకు లేఆఫ్‌ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

బాలయ్యకే ఏమిటీ పరీక్షలు ?.. అన్నట్టు కొత్త భామలు కావాలి !

గుజరాత్‌ను బీజేపీ లూటీ చేసింది:గధ్వీ

యూజర్లకు షాకిచ్చిన ఎయిర్‌టెల్..

- Advertisement -