సచిన్‌ చేతిలో మాల్యా విల్లా..

232
- Advertisement -

గోవాలోని విలాసవంతమైన కింగ్ ఫిషర్ విల్లాను సినీ నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి సొంతం చేసుకున్నారు. ఈ విల్లాను అమ్మేందుకు బ్యాంకు అధికారులు చాలా సార్లు వేలానికి ఉంచగా దాన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరిసారిగా వేలానికి ఉంచిన రిజర్వ్ ధర రూ.73 కోట్లు చెల్లించేందుకు సచిన్‌ జోషి అంగీకరించారు.
 Sachiin Joshi buys Vijay Mallya's Kingfisher Villa
ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతి భట్టాఛార్య ధ్రువీకరించారు. కాగా, బ్యాంకులకు మాల్యా భారీ మొత్తంలో రుణాలను ఎగవేసిన కేసులో ఆయన ఆస్తులను బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిన విషయమే. సుమారు రూ.9వేల కోట్లకుపైగా రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్నారు విజయ్‌ మాల్యా.

దీంతో ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలానికి పెట్టారు. గోవాలోని మాల్యా విల్లాను ఇప్పటి వరకు మూడు సార్లు వేలాని ఉంచారు. అయితే అది కొనడానికి ఎవరూ అంత ఆసక్తి చూపలేదు. ఇక చివరిసారిగా మార్చి నెలలో ఆయన ఇంటిని వేలానికి వేశారు. దీంతో సచిన్‌జోషి మాల్యా విల్లాను తన సొంతం చేసుకున్నారు.

- Advertisement -