మణి నోట…రజిని పొలిటికల్‌ మాట..!

222
Rajinikanth has right to decide if he wants to get into politics
- Advertisement -

సినిమాల గురించైనా..మరే ఇతర విషయాల గురించైనా..అవకాశం వస్తే చాలు స్పీచ్‌ల మీద స్పీచ్‌ లు ఇచ్చేస్తుంటారు కొంతమంది. కానీ మణిరత్నం మాత్రం ఛాన్స్‌ వచ్చినా..ఆయన సినిమాల గురించి మాట్లాడడం తక్కువే. ఎందుకంటే ఆయన కంటే ఆయన సినిమాలే మాట్లాడుతాయి అనేలా ఉంటారు మణి.

అయితే ఇదంతా ఓల్ట్ ఫ్యాషన్‌ అనుకున్నారో ఏమో గానీ..మణి రత్నం నోట మాటలు స్పీడందుకున్నాయి. ఓన్లీ ఆయన సినిమాల గురించే కాదు, వేరే విషయాలపై కూడా నోరు విప్పేస్తున్నారు మణిరత్నం.
 Rajinikanth has right to decide if he wants to get into politics
అయితే మణి రత్నం సినిమాలపై ఎక్కువగా మాట్లాడడం ఒక ఎత్తైతే…రజిని రాజకీయ అంశంపై మాట్లాడడం మరో ఎత్తు. అవును…మణి నోట పొలిటికల్‌ మాట వచ్చేసింది.  అయితే…ఆయన కొత్త సినిమా ‘చెలియా’ ప్రమోషన్లలో భాగంగా అనేక ఆసక్తర విషయాలపై మాట్లాడారు. అందులో రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం అంశం కూడా ఉండటం విశేషం.

సూపర్‌ స్టార్‌ రజినీ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వాలని డిమాండ్ చేసే హక్కు ఎవ్వరికీ లేదంటున్నారు మణిరత్నం. రాజకీయాల్లోకి రావాలని రజినీపై ఎలా ఒత్తిడి తీసుకొస్తాం.. పూర్తిగా అది ఆయన ఇష్టం అంటూ మాట్లాడారు మణి. అంతేకాకుండా.. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు రజినికే ఉందని, రజిని కూడా అందరిలాంటి మామూలు మనిషేనని చెప్పుకొచ్చారు.

అయితే సరైన సమయం వచ్చినపుడు.. రజిని వల్ల అవుతుంది అన్నప్పుడు రజినియే నిర్ణయం తీసుకుంటారేమోనని, ఆయనకు రహస్య అజెండాలున్నాయని తానైతే అనుకోవడం లేదన్నారు. ఏదేమైనా ప్రజలకు ఏది మంచిదనిపిస్తే రజినీ అదే చేస్తాడని మణిరత్నం అన్నాడు.
Rajinikanth has right to decide if he wants to get into politics
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆయన కొడుకు నందన్ పీహెచ్డీ చేయాలనుకుంటున్నాడని, ఈ ఇంటర్వ్యూలో తన కొడుకు నందన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు మణి. ఆయన కొడుకు నందన్‌కు సినిమాలంటే ఆసక్తి లేదని, విద్యావేత్త కావాలనుకుంటున్నాడని చెప్పారు. ఇక నందన్‌ సినిమాల వైపు కన్నెత్తి చూడాలనుకోవట్లేదని కూడా చెప్పారు.

ఇక ఆయన చదివిన చదువుకు.. చేస్తున్న పనికి సంబంధం లేదు అన్నారు మణిరత్నం. తనకు చదువు మీద మంచి అభిప్రాయం ఉందని, మనకొక హోదా కల్పించేది మాత్రం చదువే అని ఆయన మాటల్లో చెప్పేశారు మణిరత్నం.

- Advertisement -