అతను హీరోనా ?… ‘యస్ హీరో అంటే అతనే’.. దటీజ్ ఎన్టీఆర్ !

108
ntr jr
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి ప్రేక్షకులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఎన్టీఆర్ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ రేంజ్ లో ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మునుపెన్నడూ కనిపించని విధంగా పూర్తి డిఫరెంట్ మేకోవర్ లోకి జూనియర్ ఎన్టీఆర్ ఒదిగిపోయిన విధానం నిజంగా అద్భుతం. రింగులు తిరుగుతూ పైకి మళ్ళిన జుట్టు, లైట్ గా గుబురుగా కనిపిస్తున్న గడ్డం, కళ్ళకు అందమైన కళ్ళజోడు, వైట్ షర్ట్ పై డార్క్ బ్లీజర్.. అచ్చం స్టైలిష్ వరల్డ్ కి నిజమైన స్టార్ గా కనిపించాడు ఎన్టీఆర్. ఇంతకీ ఎన్టీఆర్ ఉన్నట్టు ఉండి ఈ లుక్ లోకి ఎందుకు మారిపోయాడు అంటూ ఫ్యాన్స్ చర్చ మొదలు పెట్టారు.

ఏది ఏమైనా ఎన్టీఆర్ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్.. సూపర్ స్టైలిష్ గా ఉన్నాయి. అందుకే.. ఈ మధ్య నేషనల్ స్టార్ అయ్యాడు. టాలీవుడ్ కి గాడ్ ఆఫ్ మాస్ హీరో అయ్యాడు. నిజానికి ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని సినిమాలో ఎన్టీఆర్ ని చూసి.. ‘ఈ కుర్రాడు హీరోనా ?’ అన్న వాళ్లందరి చేత.. ‘యస్ మాస్ హీరో అంటే కేవలం ఇతనే’ అనిపించాడు ఎన్టీఆర్. సాధారణమైన కుర్రాడి లుక్ నుంచి గాడ్ ఆఫ్ మాస్ గా ఎదగడానికి ఎన్టీఆర్ చేసిన కృషి అమోహం. అనీర్వచనం. అందుకే.. ప్రతిభకు జూ.ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఇక్కడ మరో విషయం కూడా ప్రత్యేకంగా చెప్పుకొవాలి. సక్సెస్ రాగానే ఎవరైనా కొంత రిలాక్స్ అవుతారు.

కానీ, స్టార్ అయ్యాక కూడా జూ. ఎన్టీఆర్ ఎన్నడూ ఎప్పుడూ రిలాక్స్ కాలేదు. ప్రతి అవకాశంలోనూ తన ప్రతిభను కనబరచాలని ఎన్టీఆర్ నిత్యం తపన పడుతూనే ఉన్నాడు. సీనియర్ ఎన్టీఆర్ కి స్వయానా మనవడు అయినా.. తనలోని ప్రతిభని మాత్రమే నమ్ముకొని స్టార్ గా సక్సెస్ అయిన అసలు సిసలైన స్టార్ హీరో జూ.ఎన్టీఆర్. అందుకే తారక్ కి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో నీరాజనాలు పలుకుతున్నారు. ఈ రోజు ఎన్టీఆర్ నుంచి ఓ లుక్ బయటకు రాగానే.. ఆ పిక్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది అంటే.. ఇంతకు మించిన స్టార్ డమ్ ఏమి ఉంటుంది. ‘డియర్ తారక్ ఇలాగే నీ పయనం కొనసాగించు. ఆల్ ది బెస్ట్.

ఇవి కూడా చదవండి..

 

- Advertisement -