మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘బాస్ పార్టీ’ అనే సాంగ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్రబృందం ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో.. మెగాస్టార్ పక్కా మాస్ అవతార్ లో స్పెషల్ లుక్ లో కనిపించనున్నారు. అలాగే ఈ ప్రోమోలో దేవి గాత్రం యూత్ కి ఊపు తెచ్చేలా ఉంది. మొత్తానికి ఈ ప్రోమో ఎనర్జిటిక్‌గా సాగింది. ఒక్కమాటలో ఈ ప్రోమో ట్రాక్ మాస్ కి ఫీస్ట్ గా అనిపిస్తోంది. పూర్తి పాటను నవంబర్ 23వ తేదీన సాయంత్రం 04 గంటల 35 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి బిగ్గెస్ట్ పార్టీ ఆఫ్ ది ఇయర్ అంటూ రానున్న ఈ పాట కోసం ఆ రోజు రెడీగా ఉండండి.
కాకపోతే.. పాజిటివ్ లో కూడా నెగిటివ్ అన్నట్టు ఈ సాంగ్ లో కూడా ఓ రెగ్యులర్ ట్యూన్ హైలైట్ అవుతుంది. ఈ లెక్కన ఈ పాట నిజంగానే మెగాస్టార్ రేంజ్ లో ఉంటుందా ?, నిజమే, మెగాస్టార్ సినిమా అనగానే దేవిశ్రీప్రసాద్ కి సహజంగానే పూనకం వచ్చేస్తోంది. కానీ ఇక్కడ సమస్య అల్లా దేవి ఫామ్ లో లేడు. పైగా గత కొన్ని సినిమాలుగా తన మార్క్ ను చూపించలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అందుకే, దేవి నుంచి వచ్చే పాటలు డిటిఎస్ బాక్స్ లు బద్దలు కొడతాయా ? లేదా ? అనే టెన్షన్ లో ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఇప్పటికే కీలక షెడ్యూల్స్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ‘వాల్తేరు వీరయ్య’, మరో కొత్త షెడ్యూల్ కోసం వచ్చే వారం నుంచి రెడీ కానుంది.
ఈ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ లో చిరంజీవికి రవితేజ సవతి తల్లి కొడుకుగా కనిపిస్తున్నాడు. ఈ రెండు పాత్రల మధ్య గట్టి ఎమోషనల్ వార్ కొనసాగుతుంది. చిరు – రవితేజ పాత్రల మధ్య వచ్చే ఆ నాటకీయ పరిణామాలే.. ఈ సినిమాలో డెప్త్ ను బాగా ఎలివేట్ చేస్తోందట. మరి వాల్తేరు వీరయ్య సంక్రాంతికి ఏ స్థాయి విజయాన్ని సాధిస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి..