భారతీయ సినీ తెరపై దర్శకుల విభాగంలో ప్రస్తుతం ధ్రువతారగా వెలిగిపోతున్న ఏకైక దర్శక దిగ్గజం.. ‘రాజమౌళి. జక్కన్న సినీ ప్రస్థానాన్ని సింహావలోకనం చేసుకుంటే.. స్మాల్ స్క్రీన్ టు సిల్వర్ స్క్రీన్. ఇప్పుడు నేషనల్ స్క్రీన్ టు ఇంటర్నేషనల్ స్క్రీన్… అదీ రాజమౌళి రేంజ్. మొత్తనికి భారీ సినిమాల సృష్టికర్తగా జక్కన్నకి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు వచ్చింది. అందుకు నిదర్శనమే.. లాస్ ఏంజెల్స్‌లో 13వ వార్షిక గవర్నర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనాలని రాజమౌళికి ఆహ్వానం అందడం. కేవలం అరుదైన సినీ ప్రముఖులకు మాత్రమే ఈ ఈవెంట్ నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆ ఆహ్వానం అందుకున్న ముఖ్య వ్యక్తుల్లో రాజమౌళి కూడా ఒకరు కావడం తెలుగు సినిమాకే గర్వకారణం.
ఇక ఈ గవర్నర్ అవార్డుల ఈవెంట్ కి రాజమౌళి తన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయతో కలిసి స్పెషల్ గా వెళ్ళాడు. వెళ్లడం అంటే.. రెగ్యులర్ జనరల్ లుక్ లో కాదండోయ్. వెరీ స్టైలిష్ బ్లాక్ సూట్లో అల్ట్రా మోడ్రన్ లుక్ లో జక్కన్న వెళ్ళాడు. నిజంగానే ఈ స్టైలిష్ లుక్‌లో రాజమౌళి చాలా స్పెషల్ గా కనిపించారు. పైగా తన కొడుకు కార్తికేయ తో కలిసి బ్లాక్ సూట్లో క్రేజీ ఫోజులు ఇచ్చారు. ఈ ఫొటోలను కార్తికేయ తాజాగా తన ట్విటర్ వేదికగా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట్లో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
ఏది ఏమైనా సున్నితమైన భావోద్వేగాలను కూడా గుండె బరువెక్కేలా ఊహకు అందని గ్రాండ్ విజువల్స్ తో బలంగా చూపించడం ఒక్క రాజమౌళికే చెల్లింది. పైగా తెలుగు వెండితె వైభోగాన్ని భారతీయ మరియు ప్రపంచ సినీ వెండితెరకు అద్దిన ఘనత కూడా ఒక్క రాజమౌళికి మాత్రమే దక్కింది. ఐతే, ఇక్కడ ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. రాజమౌళి మొదటి నుంచి తన సినీ కెరీర్ ను క్రమ శిక్షణతో స్వయంగా తానే అభివృద్ధి చేసుకోవడం విశేషం.
❤️🔥❤️🔥❤️🔥 @ssrajamouli pic.twitter.com/V3ZNratBtg
— S S Karthikeya (@ssk1122) November 20, 2022
ఇవి కూడా చదవండి..