టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటిరియర్ డిజైనర్ అనూష అనే యువతిని వివాహం చేసుకున్నారు. బందువులు అత్యంత సన్నిహితుల మధ్య నాగశౌర్య వివాహం జరిగింది. బెంగళూర్లో ఉదయం 11.25నిమిషాలకు ఘనంగా జరిగింది. వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శౌర్య వివాహం చేసుకున్నఅమ్మాయి పేరు అనూష షెట్టి. ఈమె ఓ ఫేమస్ ఇంటీరియర్ డిజైనర్. 2020లో ఇండియన్ టాప్ మోస్ట్ 40 ఇంటీరియర్ డిజైనర్లలో ఈమె కూడా ఒకరు. ఇక తన పేరు మీదే 2019లో ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని కూడా స్టార్ట్ చేశారు.
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా బ్రేక్ అందుకున్నాడు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు శౌర్య. ఆ తర్వాత ‘దిక్కులు చూడకు రామయ్య’ ‘ఓ బేబీ’ ‘ఛలో’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. రీసెంట్ గా కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. తాజాగా కానీ ఈ కుర్ర హీరో మూడుముళ్ల బంధంతో ఒక ఇంటివాడయ్యాడు.
ఇవి కూడా చదవండి..