తెరముందు నవ్వించే మనుషుల వెనుక ఎన్నో వ్యథలు ఉంటాయని మనలో ఎంతమందికి తెలుసు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు నవ్వు అనేది ఒక యోగంలా మారింది. కానీ వారి వెనుక ఉన్న బాధలు ఎంతమందికి తెలుసు..వారి గురించి ఎవరికి తెలుసు. కానీ అందరూ వారిని చూసి నవ్వేసుకుంటాము.
తెరవెనుక మాత్రం నవ్వులు వెనుక మాత్రం ఎన్ని బాధలు ఉన్నాయో తెలుసా… జబర్దస్త్ షోలో మనందరికి సుపరిచితమైన వ్యక్తి పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని తెరముందు కూడా చాలా సార్లు వివిధ పోగ్రామ్స్‌లో కూడా చెప్పాడు. మానసికంగా శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచ్ ప్రసాద్‌కు తాజాగా మరో సమస్య వచ్చింది.
పంచ్ ప్రసాద్ పరిస్థితి గురించి నూకరాజు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలియజేశారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ తాజాగా మరో సమస్యతో బాధపడుతున్నారు. నడుము నొప్పితో చాలా ఇబ్బందిపడుతున్న దృశ్యాలను మనం ఆ వీడియోలో చూడవచ్చు.
పంచ్ ప్రసాద్‌కు నడుము వెనకవైపు కుడికాలు వరకు చీము పట్టినట్టుగా డాక్టర్లు తెలిపారని నూకరాజు వీడియో ద్వారా తెలిపారు. ఇదే విషయం ప్రసాదన్నకు ఇష్టం లేకపోయినా ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నానని అందరి ఆశీస్సులుండాలని ఆయనకు ససోర్ట్ ఇవ్వాలని కోరాడు నూకరాజు.
ఇవి కూడా చదవండి..

