ఈ పాస్‌వర్డ్స్‌ వాడుతున్నారా..మీ పని ఖతం?

374
Password
- Advertisement -

సైబర్ క్రైమ్..పాస్ వర్డ్..ఓటీపీ…ఈ పేరు ఇప్పుడు బ్యాంక్‌ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఏదో రూపంలో విన్నవే. ఎందుకంటే పెరుగుతున్న సాంకేతికతో ఓ వైపు మంచే జరుగుతుండగా మరోవైపు చెడు కూడా అంతే స్ధాయిలో పెరిగిపోతోంది. ఏ మాత్రం అమాయకంగా ఉన్న బ్యాంకు అకౌంట్‌లో ఉన్న డబ్బులు మాయమే. డిజిటల్ పేమెంట్స్‌ రోజుకు కోట్లలో జరుగుతుండగా దీనిని సైబర్ నేరగాళ్లు అంతే ఈజీగా క్యాష్ చేసుకుంటున్నారు. ప్రజలను ప్రభుత్వాలు, అధికారులు ఎంత అప్రమత్తం చేసినా ప్రజలు జాగ్రత్తగా ఉండకపోవడంతో సైబర్ క్రైమ్ పెరిగిపోతూనే ఉంది.

ఇక ఈ సైబర్ క్రైమ్‌లో కీలకపాత్ర పాస్ వర్డ్, ఓటీపీలను ఇతరులకు చెప్పడం. అందుకే తరచు పాస్ వర్డ్‌లను మార్చడం ద్వారా కొంత ఆన్‌లైన్ మోసాలకు బ్రేక్ వేయవచ్చు. అయితే పాస్ వర్డ్‌ల విషయంలో భారతీయులు ఎంత అలర్ట్‌గా ఉన్నారో చెప్పేందుకు ఓ సంస్థ ప్రచురించిన జాబితా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

2022లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించిన పాస్‌వర్డ్స్‌ ఇవేనంటూ నార్డ్‌ పాస్‌ సంస్థ వివరాలను వెల్లడించింది. చాలామంది ఈజీగా తమ పాస్‌వర్డ్స్‌ గుర్తుంచుకోవడం కోసం బలహీనమైన పాస్‌వర్డ్స్ వాడుతున్నారని తెలిపింది. ఇందులో తొలిస్థానంలో ఉన్న Passwordను పాస్‌వర్డ్‌గా 34లక్షల సార్లు ఉపయోగించారు. ఈ జాబితాలో ఉన్న బిగ్‌బాస్కెట్‌ అనే పాస్‌వర్డ్‌ను కేవలం 5 నిమిషాల్లోనే క్రాక్‌ చేశారు. దీన్ని ప్రజలు 75 వేల సార్లు ఉపయోగించడం విశేషం.

♦Password
♦123456
♦12345678
♦bigbasket
♦123456789
♦pass@123
♦1234567890
♦anmol123
♦abcd1234
♦googledummy

ఈ పాస్‌వర్డ్‌లను ఎక్కువగా ఉపయోగించారు. సో ఇకనైనా కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉండేలా పాస్‌వర్డ్ ఎంపిక చేసుకోవడం ఒక ఎత్తైతే అవతలివారు ఈజీగా గెస్ చేసేలా పాస్ వర్డ్స్ ఉండకూదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -