తెలంగాణలో జాకీ గార్మెంట్‌…కేటీఆర్‌

366
- Advertisement -

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పెట్టుబడుల ప్రవహం కొనసాగుతుంది. తాజాగా జాకీ గార్మెంట్‌ ఫ్యాక్టరీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టెందుకు మందుకు వచ్చింది. జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ సన్మానించారు.

మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ… జ‌నాల్లో పాపులారిటీ సంపాదించుకున్న ఇన్న‌ర్ వేర్ బ్రాండ్ జాకీ(పేజ్ ఇండ‌స్ట్రీస్) ఇబ్ర‌హీంప‌ట్నం, ములుగులో గార్మెంట్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ ఫ్యాక్ట‌రీల‌ను ఏర్పాటు చేయ‌బోతుంద‌ని కేటీఆర్ తెలిపారు. ఒక కోటి బ‌ట్ట‌ల‌ను ఉత్ప‌త్తి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ ఫ్యాక్టరీని నెల‌కొల్ప‌నున్నారు. దీంతో 7 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

ఒకే ఫ్రేమ్‌లో జగన్‌ -బాలయ్య..ఏం జరిగిందో తెలుసా?

బీఎస్‌ఎన్‌ఎల్ ఆస్తుల అమ్మకం షురూ!

అమెరికా అధ్యక్ష బరిలో ట్రంప్‌

- Advertisement -