ఈ రేస్‌..ట్రాఫిక్ ఆంక్షలు

279
e prix
- Advertisement -

ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేస్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. దేశంలోనే ఈ రేస్‌కు ఆతిథ్యం ఇస్తున్న తొలి నగరంగా హైదరాబాద్ నిలవగా రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్‌కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది.

ఈ నెల 19, 20 తేదీల్లో ఫార్ములా ఈ కార్ల రేసింగ్ నిర్వహించనుండగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రేస్ నేపథ్యంలో నేటి నుండి ట్రాఫిక్ ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు పోలీసులు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లడానికి అనుమతి లేదు. ఈ ట్రాఫిక్‌ను వీవీ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు మళ్లించారు. అలాగే- బుద్ధ భవన్/నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్/ట్యాంక్‌బండ్ వైపు మళ్లించారు. రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు.

ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం/లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. బీఆర్‌కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్/రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ జంక్షన్ వద్ద రవీంద్ర భారతి వైపు మళ్లించారు.

ఫార్ములా ఈ కార్ల రేసింగ్ కారణంగా ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్‌ను శుక్రవారం నుంచి సోమవారం వరకు మూసివేయనున్నారు. అఫ్జల్‌గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్‌ మీదుగా కాకుండా తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, కట్ట మైసమ్మ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, డీబీఆర్‌ మిల్స్‌, కవాడిగూడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -