ఓ శకం ముగిసింది..తరతరాలకు ఆదర్శం వీరు!

219
tollywood
- Advertisement -

టాలీవుడ్‌లో ఓ శకం ముగిసింది. వెండితెరపై ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన కృష్ణ ఇకలేరు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమ మూగబోయింది. కృష్ణ మృతితో అలనాటి దిగ్గజ నటుల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు అంతా. ఇండస్ట్రీ అంటే ఎన్టీఆర్, ఏఎన్నాఆర్,కృష్ణ,శోభన్ బాబు,కృష్ణం రాజు. అలనాటి నటులు అనగానే వీరే గుర్తుకొస్తారు.

ఎందుకంటే సినీరంగం కోసం వీరు చేసిన సేవలు అనన్యసామాన్యం. తెలుగు తెరపై విభిన్న కథ, మల్టీస్టారర్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు కృష్ణ. కౌబాయ్‌ సినిమాను తెలుగుకు తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి. తొలి జేమ్స్‌బాండ్‌ చిత్రం ‘గూఢచారి 116’, తొలి కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్ళకు మోసగాడు’, తొలి తెలుగు సినిమా స్కోప్‌ ‘అల్లూరి సీతారామరాజు’, తొలి తెలుగు 70ఎంఎం సినిమా ‘సింహాసనం’, తొలి ఓ.ఆర్‌.డబ్ల్యు రంగుల చిత్రం ‘గూడుపుఠాణి’, తొలి ప్యూజీ రంగుల చిత్రం ‘భలే దొంగలు’, ఇలా ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచారు కృష్ణ.

మంచి మనసున్న వ్యక్తిగా తన సినిమాలకు పనిచేసిన ఎంతో మంది ప్రొడక్షన్ మేనేజర్స్‌ను నిర్మాతలుగా చేసిన ఘనత కృష్ణకే దక్కుతోంది. కృష్ణ దగ్గర చెల్లని చెక్కులు ఎన్నో ఉన్నాయి. వాటి విలువ కూడా కొన్ని వందలు కోట్లు ఉంటుందని కృష్ణ పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. కానీ ఏరోజు వారిమీద ఒత్తిడి తీసుకురాలేదు. అది ఆయన గొప్పతనం. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత.. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు త్రిమూర్తులుగా వెలుగొందారు. ముఖ్యంగా కృష్ణంరాజుతో కలిసి అత్యధికంగా 19 మల్టీస్టారర్‌ సినిమాల్లో కలిసి నటించారు కృష్ణ.

డాక్టర్ నందమూరి తారకరామారావు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు… ఇద్దరూ ఇద్దరే. తెలుగు చిత్రరంగానికి రెండు కళ్లు. తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరూ అందించారు. ఎన్టీఆర్ 1996 జనవరి 18న తన 72వ ఏట కన్నుమూసారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు 2014 జనవరి 22న తన 90వ తుదిశ్వాస విడిచారు. రీసెంట్‌గా సెప్టెంబర్ 11న కృష్ణంరాజు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. మొత్తంగా దిగ్గజ నటులు అంతా భువి నుండి దిగికెగియడం తెలుగు కళామతల్లికి తీరని లోటు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -