కంపెనీ లాట్రైబ్యునల్‌కు సుబ్బరామిరెడ్డి ఎందుకో తెలుసా..

322
- Advertisement -

గాయత్రి ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ అనే సంస్థపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌లో దివాలా పిటిషన్‌ దాఖలయ్యాయి. గాయత్రి సంస్థల అధిపతి అయిన కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్‌ నేత టి. సుబ్బరామిరెడ్డికి చెందిన గాయత్రి సంస్థలు గత కొద్ది సంవత్సరాలుగా నష్టాలు రావడం వల్ల దివాళా తీసినట్టుగా ప్రకటించారు. దీంతో సదరు సంస్థపై రుణాలు ఇచ్చిన సంస్థలు హైదరాబాద్‌ బెంచ్‌ అయిన జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ సంస్థలో పిటిషన్లు వేశారు.

సుబ్బరామిరెడ్డి భార్య ఇందిరా సుబ్బరామిరెడ్డి, బంధువులు, సన్నిహితులు టి.సరితారెడ్డి, టి.వి.సందీప్ రెడ్డి, జె.సుశీలారెడ్డి, జి.సులోచన, జి.శివకుమార్ రెడ్డి తదితరులపై వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. గాయత్రి ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.6వేల కోట్లకుపైగా రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలమయ్యాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

రుణాలు చెల్లించడంలో విఫలమయ్యారని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎమ్‌) ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పేరుమీద తీసుకున్న రుణానికి సంబంధించి హమీదారుగా ఉన్న టి. సుబ్బరామిరెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. దివాలా ప్రక్రియ ప్రారంభించి రుణాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని బీవోఎమ్‌ ఎన్‌సీఎల్‌టీను కోరింది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.400 కోట్ల, ఎస్‌బీఐ నుంచి రూ.240 కోట్లకుపైగా ఈ సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐలు దాఖలు చేసిన పిటిషన్లపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ జ్యుడిషియల్‌ సభ్యులు డాక్టర్‌ బి.ఎన్‌.వి.రామకృష్ణ, సాంకేతిక సభ్యులు సత్యరాజన్‌ ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసింది.

గాయత్రి ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌కు వివిధ ప్రాజెక్ట్‌లలో సహకరించినందుకు తీసుకున్న రుణాలకు కనీసం బకాయిలు చెల్లించడంలేదని… కటారియా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌, కునాల్‌ కొంచం ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధలు కూడా దివాలా పరిష్కారం చూపించాలని దానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలంటూ పిటిషన్లు కూడా దాఖలు చేశాయి. వీటితో పాటుగా కెనరా బ్యాంకు కూడా దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఎన్‌సీఎల్‌టీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి..

ఈ నెల 15న టీఆర్‌ఎస్‌ఎల్పీ మీటింగ్‌

తెలంగాణ డ్యాకుమెంటరీలకు అవార్డులు…కేటీఆర్ ప్రశంస

త్వరలో మహబూబాబాద్‌కు సీఎం..

- Advertisement -