షర్మిల పాదయాత్ర…దండగే!

218
- Advertisement -

రాజకీయ నాయకులు పాదయాత్ర చేయడం కొత్తేమీ కాదు. అలా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన వారిలో తెలుగు రాష్ట్రాల నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వారే. కష్టకాలంలో ఉన్న పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడింది. అలాగే పాదయాత్రలు చేసి ఉనికిని కొల్పోయిన వారు ఉన్నారు. ఇక తాజాగా ఇప్పుడు తెలంగాణలో షర్మిల చేస్తున్న పాదయాత్ర అలాంటిదే. ఇదే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులే కాదు ప్రజలు సైతం బహిరంగంగానే చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ తరఫున షర్మిల ప్రచారం నిర్వాహించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని జగన్ ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. దీంతో కొద్దిరోజులు పాలిటిక్స్‌కు దూరమైన షర్మిల….తర్వాత తెలంగాణ కోడలినంటూ వైఎస్సాఆర్‌టీపీ పేరుతో ఇక్కడ రాజకీయాల్లోకి ప్రవేశించి పాదయాత్ర పేరుతో తిరుగుతున్నారు. ఇందులో భాగంగా తొలుత ప్రతి మంగళవారం దీక్ష కూడా చేశారు. ఈ దీక్షకు అంత స్పందన రాకపోవడంతో తర్వాత దానిని ఆపేసి పాదయాత్ర మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటివరకు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా తగిన గుర్తింపుమాత్రం రావడం లేదు. ఈ విషయాన్ని ఆమె పార్టీ నేతలే స్వయంగా వెల్లడిస్తున్నారు.

వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత మారాష్ట్రం అనే ఆలోచన ప్రజల మెదళ్లలో బాగాచొచ్చుకుపోయింది. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో కంచుకోటగా ఉన్న టీడీపీని ప్రజలు అడ్రస్‌ లేకుండా చేశారు. ఆంధ్రాపార్టీ పేరుతో తిరస్కరించారు. అయితే ఇప్పుడు అదే ఆంధ్రా నుండి వచ్చిన షర్మిల ఇక్కడి రాజకీయాల్లో రాణించాలని భావించినా ఆమెకు ఆదరణ సంగతి పక్కనపెడితే కనీసం ప్రజలు చర్చించడం కూడా లేదు.

పరాయి రాష్ట్రంలో కిరాయి యాత్ర అంటూ నెటిజన్లు తూర్పార బడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ద్రోహన్ని గుర్తుచేస్తున్నారు. ఆంధ్రా,సీమ సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేసి తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం శంకుస్థాపన చేసి పెండింగ్ లో పెట్టిన విషయాన్ని షర్మిలకు గుర్తుచేస్తున్నారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 55 వేల క్యూసెక్కులకు పెంచి పాలమూరు రైతుల నోట్లో మన్నుకొట్టింది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రకటన రాగానే ఆంధ్రాలో యాత్రలు చేస్తూ తెలంగాణ పాకిస్థాన్ అంటూ విషం కక్కినదానిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఇవన్నీ పక్కనపెడితే షర్మిల పాదయాత్ర ఒక్క రోజు ఖర్చు రూ.25 లక్షల నుండి రూ.30 లక్షలు. రోజుకు కోటి ఖర్చు పెట్టినా ప్రజల నుండి ఆదరణ మాత్రం గుండుసున్నా. అంతేగాదు 3 వేలు కాదు 30 వేల కిలోమీటర్లు నడిచిన ప్రజలు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ సమాజ చైతన్యాన్ని తక్కువగా అంచనా వేస్తూ సాగుతున్న అవివేకపు యాత్ర మానుకొని ఇప్పటికైనా సొంతరాష్ట్రం ఏపీకి పోవాలని పలువురు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -