- Advertisement -
మునుగోడు కౌంటింగ్ ఆలస్యం పై మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన… కేంద్ర ఎన్నికల పరిశీలకుల తీరు తోనే మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఆలస్యం అవుతున్నాయన్నారు.
బిజెపి ఓటమి ఖాయం అయిందని…ఈ విషయాన్ని బిజెపి అభ్యర్ధి రాజ్ గోపాల్ రెడ్డినే స్వయంగా మీడియా ముందు ఒప్పుకున్నాడన్నారు. ఓటమి ని తప్పించుకోవడానికి బిజెపి ఆడుతున్న నాటకం అని ఆరోపించారు.
మునుగోడు లో న్యాయం, ధర్మమే గెలవబోతుందన్నారు. కౌంటింగ్ కేంద్రం నుండి వస్తున్న లీకులపై ఈసి స్పందించాలన్నారు.
- Advertisement -