- Advertisement -
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వాతావరణంలో మార్పులు సంభవించాయి. రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజుల్లో కనిష్ఠంగా 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, గరిష్ఠంగా 28 నుంచి 30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇప్పటికే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ముఖ్యంగా సాయంత్రం, రాత్రి సమయాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురిసింది.
ఇవి కూడా చదవండి..
సెక్యూలర్ పదాన్ని తప్పుగా చెబుతున్నారు:సీతారం
మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధం:ఈసీ
కండల వీరుడికి వై+భద్రత కేటాయింపు
- Advertisement -