- Advertisement -
గుజరాత్లోని మోర్బీ జిల్లాలో ఘోరా ప్రమాదం చోటుచేసుకుంది. మచ్చు నదిలో ఆదివారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం.. పునర్నిర్మాణం తర్వాత ఐదు రోజుల క్రితం కేబుల్ వంతెన పునఃప్రారంభించబడింది. బ్రిడ్డ్ కుప్పకూలిన సమయంలో 400-500 మంది భక్తులు వంతెనపై ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు
వంతెన కూలడంతో పలువురు నదిలో పడిపోయారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మణి మందిర్ సమీపంలో మచ్చు నదిపై ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి ఆరు నెలల పాటు పునరుద్ధరణ కోసం మూసివేయబడిన తరువాత ఐదు రోజుల క్రితం తిరిగి తెరవబడింది. రూ.2 కోట్లతో వంతెనను పునరుద్ధరించారు.
- Advertisement -