దేశంలోనే ధనిక సిఎం చంద్రబాబు

252
Chandrababu Is the Richest CM
- Advertisement -

ఏపీని దేశంలోనే టాప్ రాష్ట్రంగా నిల‌బెడ‌తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు టాప్ వ‌న్ గా నిలిచారు. విభ‌జ‌న క‌ష్టాల్లో ఉన్నామ‌ని, ఏపీ చాలా ఇబ్బందుల్లో ఉన్నామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబుకి తిరుగులేద‌ని నిరూపితమ‌య్యింది. నాకు డబ్బులు ముఖ్యం కాదు… రాష్ట్ర ప్రజలకు సేవ చేయటమే నా లక్ష్యం… తన చేతికి వాచీ లేదు.. జేబులో రూపాయి లేదని చెప్పుకునే చంద్రబాబు తన వ్యక్తిగత ఆస్తుల్లో మాత్రం దేశంలోనే నెంబర్‌ 1 సీఎంగా అవతరించారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆస్తులు, వారిపై ఉన్న నేరాభియోగాలు.. వంటి అంశాలపై అధ్యయనం చేసిన ఇండియాటుడే.. అందుకు సంబంధించిన గణాంకాలను వెల్లడించింది. ప్రత్యేకించి.. ధనిక, పేద ముఖ్యమంత్రుల జాబితా ఆసక్తికరంగా ఉంది. ఆస్తుల విషయంలో.. తను నిరుపేదను అని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ జాబితాలో తొలిస్థానం దక్కడం విశేషం. వ్యక్తిగతంగా రూ.177 కోట్ల రూపాయల ఆస్తులతో చంద్రబాబు నాయుడు అత్యంత ధనికుడైన సీఎంగా నిలిచాడని  ఇండియాటుడే పేర్కొంది.

Chandrababu Is the Richest CM

ఇక  ఈ జాబితాలో 129 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు అరుణాచల్ ప్రదేశ్ సీఎం. మరి రెండో స్థానంలో ఉన్న వ్యక్తి కన్నా బాబు ఆస్తులు దాదాపు 48 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం.  ఇటీవలే పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ మూడో స్థానంలో, హిమాచల్ సీఎం నాలుగో స్థానంలో ఉండగా.. ఐదో స్థానంలో సీఎం కేసీఆర్ నిలిచారు. సీఎం కేసీఆర్ ఆస్తి రూ. 15 కోట్లు. తెలంగాణ సీఎం ఆస్తులతో పోలిస్తే చంద్రబాబు ఆస్తులు దాదాపు పన్నెండు రెట్లు ఎక్కువ!

కేవలం వ్యక్తిగతంగా వందల కోట్లను పోగేసుకున్న వాళ్లే కాదు.. దేశంలో నిరుపేద సీఎంలు కూడా ఉన్నారు. వారిలో ముందున్నారు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. అత్యంత నిజాయితీ పరుడిగా పేరు పొందిన ఈ కమ్యూనిస్టు పార్టీ లీడర్ ఆస్తులు కేవలం 26 లక్షల రూపాయలు మాత్రమే. నిరుపేద సీఎంలలో రెండో స్థానంలో ఉన్నారు జే అండ్ కే సీఎం మెహబూబా. ఆమె ఆస్తులు కేవలం 55 లక్షల రూపాయలు. హర్యానా, జార్ఖండ్ సీఎంలు కూడా పేదలే. ఇక ఇటీవలే యూపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆధిత్యనాథ్ నిరుపేదల్లో టాప్ ఫైవ్ లో ఉన్నారు. 72 లక్షల రూపాయల సంపదతో ఆయన ఈ జాబితాలో చివరి నుంచి ఐదో స్థానంలో ఉన్నారు.

ఇదివరకే చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని కాగ్ నివేదిక బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా సీఎం విమానాల పర్యటన కోసం ఏకంగా 15 కోట్ల రూపాయలు అక్రమంగా చెల్లించారని కాగ్ కూడా కడిగేసింది. తాజాగా ఇండియాటుడే సర్వేలో దేశంలోనే ధనిక సీఎంగా చంద్రబాబు తొలిస్ధానంలో నిలవడం చర్చనీయాంశమైంది.

- Advertisement -