గుజరాత్‌లో బీజేపీకి షాక్‌..

103
gj
- Advertisement -

గుజరాత్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా కుమారుడు, ఎమ్మెల్యే మహేంద్రసింగ్ వాఘేలా బీజేపీ గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరారు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగదీష్ ఠాకూర్.. మహేంద్ర సింగ్ వాఘేలాకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీజేపీలో తాను ఇమడలేకపోయానని మహేంద్ర సింగ్ తెలిపారు. బీజేపీలో చేరిన గత ఐదేళ్లలో ఆ పార్టీ కార్యక్రమాలన్నింటికీ దూరంగానే ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తాను అని చెప్పారు.

వాస్తవానికి 2017లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు మహేంద్ర. 2017లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేశారు. అనంతరం మూడు నెలలకే బీజేపీలో చేరారు.

ఇవి కూడా చదవండి..

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. రెండో ఆడియో లీక్

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఆడియో వైరల్

కృష్ణా బోర్డు దండగ

- Advertisement -