BB6…జైలుకి బాలాదిత్య

128
Baladithya
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 54 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 54వ ఎపిసోడ్‌లో భాగంగా బాలాదిత్య జైలుకి వెళ్లగా కొత్త కెప్టెన్‌ శ్రీహాన్‌…చెత్త నిర్ణయాలు విసుగు తెప్పించాయి. ఇక శ్రీహాన్ కెప్టెన్ అవడం ఏంటో కానీ హౌజ్‌లో శ్రీసత్య రచ్చ మాములుగా లేదు.

ఇక యమహా కాల్ ఆఫ్ ది బ్లూ మెంట్‌ టాస్క్‌లో రోహిత్ విన్నర్‌గా నిలవగా రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కాకుండా అతడిని ఎలా చేస్తారని గట్టిగా అరిచాడు. శ్రీహాన్ వచ్చి సర్దిచెప్పినా రేవంత్ వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత శ్రీ సత్య దగ్గర కూర్చుని.. రోహిత్ కంటే నేనే బాగా ఆడాను.. నేనే బాగా చేశాను బాధపడిపోయారు.

తర్వాత ఈవారం వరస్ట్ ఇంటి సభ్యుడు ఎవరో.. సెలెక్ట్ చేసి అతన్ని జైలుకి పంపాలని శ్రీహాన్‌కి బిగ్ బాస్ సూచించగా చెత్త రీజన్‌తో బాలాదిత్యను జైలుకి పంపారు శ్రీహాన్. బాలాదిత్య.. గట్టిగానే కౌంటర్ ఇచ్చి.. జైలుకి వెళ్లాడు. శ్రీహాన్ కెప్టెన్‌ కావడంతో తానే కెప్టెన్ అయినట్లు రచ్చ చేసింది శ్రీసత్య.

శ్రీహాన్ ఓవరాక్షన్ చేస్తుండటంతో గట్టిగా ఇచ్చిపడేసింది ఇనయ. కెప్టెన్ అయితే ఎవడికి గొప్ప.. నన్ను గెలకొద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. అయితే తర్వాత ఇనయని కిచెన్ టీంలో ఉండమని ఆర్డర్ వేశారు శ్రీమాన్. తాను ఉండనని తనకు వంటరాదని చెప్పింది ఇనయ. వంట రాదంటే కుదరదు ఉండాల్సిందేనని శ్రీహాన్ చెప్పగా తాను వంట చేసిన రోజు మా నాన్న హార్ట్ ఎటాక్ వచ్చి పోయారు.. అప్పటి నుంచి వంట చేయలేదు అని చెప్పగా నోరు మూశారు శ్రీహాన్‌. తర్వాత కీర్తి కూడా తాను వంట గదిలో ఉండనని చెప్పగా ఏం చేయలేకపోయారు శ్రీహాన్.

ఇవి కూడా చదవండి…

మహేష్ బాబు అరుదైన రికార్డ్

- Advertisement -