మనకు ఓబ్యాడ్‌ కెప్టెన్‌ ఉన్నాడు:షోయబ్‌

340
- Advertisement -

టీ20 ప్రపంచకప్‌ మాజీ ఛాంపియన్‌ పాకిస్థాన్‌ జింబాబ్వేపై ఓడిపోవడంతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటుంది. తాజాగా మాజీ రావల్పండి ఎక్స్‌ప్రెస్‌ షోయాబ్‌ ఆక్తర్‌ పాక్‌ కెప్టెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వరుసగా రెండు ఓటములతో పాక్‌ సెమిస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాక్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా కెప్టెన్‌ బాబర్‌ను లక్ష్యంగా చేసుకొని బ్యాడ్‌ కెప్టెన్‌ అంటూ సంబోంధించాడు.

మీకు ఆటను అర్థం చేసుకోవడం ఎందుకు కష్టంగా ఉందో నాకు తెలియడం లేదు. మన టాప్‌ మిడిలార్డర్‌తో మనం పెద్ద విజయాలన్ని నమోదు చేయవచ్చు. కానీ నిలకడగా ఉండలేకపోతున్నారు. పాక్‌ జట్టుకు బ్యాడ్‌ కెప్టెన్‌ ఉన్నాడు. అతన్ని వల్ల ప్రపంచకప్‌ నుంచి మనం నిష్క్రమించాల్సివస్తొందని అన్నారు. మనం ఓడిపోయిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌ నావాజే వేశాడాని మండిపడ్డారు.

ఈ సందర్భంగా తన ఆటతీరును ఎక్కడ మార్చుకోవాలో తన యూట్యూబ్‌ ఛానల్‌లో విశ్లేషించాడు. వన్‌డౌన్‌లో బాబర్‌ బ్యాటింగ్‌కు రావాలి, షాహీన్‌ షా అఫ్రిది ఫిట్‌నెస్‌ సాధించాలి. కెప్టెన్సీ, మెనేజ్‌మెంట్‌ నిర్ణయాల్లో ప్రధాన లోపాలు ఉన్నాయన్నారు. మేం మీకు మద్దతునిస్తాం…కానీ మీరు ఏ స్థాయి క్రికెట్‌ అడుతున్నారు అని ప్రశ్నించారు.

గురువారం జరిగిన పాక్‌-జింబాబ్వే మధ్య ఉత్కంఠగా కొనసాగిన పోరులో…పాక్‌ జింబాబ్వేపై ఒక పరుగు తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం..

మరోసారి తలపడనున్న దాయాదులు!

భారత్‌ చేతిలో పాక్‌ ఘోరపరాజయం

- Advertisement -