వారి నుండి ప్రాణహాని ఉంది: పూరి

320
puri
- Advertisement -

దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటి లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొళ్తాపడింది. నిర్మాత పూరితో పాటు డిస్ట్రిబ్యూటర్‌,ఫైనాన్షియర్లు పూర్తిగా నష్టపోయారు.

ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లకు కొన్ని డబ్బూలు ఇచ్చేందుకు ముందకొచ్చారు పూరి. ఈ మేరకు ఒప్పందం కూడా చేసున్నారు. అయితే కొంతమంది అత్యుత్సాహంతో పూరి ఆఫీస్ ముందు ధర్నాకు దిగగా వారికి డబ్బులు ఇచ్చేది లేదని హెచ్చరించారు.

తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు పూరి. వారి నుంచి తనకి, తన కుటుంబానికి హాని ఉందని, మాపై హింసకు పాల్పడేలా వీళ్ళు ఇతరులని ప్రోత్సహిస్తున్నారని, తమకు రక్షణ కావాలని ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి..

BB6..రచ్చరచ్చ చేసిన గీతూ

ట్రెండింగ్‌లో నాట్‌ ఫర్‌ సేల్‌…

బీజేపీ సార్లు…వీరేవరో మీకు తెలియదా?

- Advertisement -