పోటీ నుండి తప్పుకున్న 10 మంది ఇండిపెండెంట్లు..

129
Minister Errabelli
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియగా ఉపససంహరణకు మరో రోజు మాత్రమే సమయం ఉంది. బరిలో 80 మందికి పైగా ఇండిపెండెంట్లు నిలవగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో 10 మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీ నుండి తప్పుకుని టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుగుంట్ల ప్రభాకర్ రావుకు మద్దతుగా నిలిచారు.

ఎన్నికల బరిలో ఉద్యమకారులు వివిధ ప్రాంతాల నుంచి పలు పార్టీలు సంస్థల ప్రతినిధులుగా పదిమంది యువకులు నామినేషన్లు దాఖలు చేయగా వారంతా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారన్న విషయం తెలుసుకున్న ఎర్రబెల్లి..వారితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారంతా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకర్ రెడ్డి విజయం కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలోనే వారిని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలిపిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ స్వార్థ పూరిత రాజకీయాలకు పరాకాష్టగా మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని…మునుగోడు ఆత్మగౌరవాన్ని గెలిపించాలని బాధ్యత ఇక్కడి ప్రజలపైనే ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి.

- Advertisement -