బీజేపీ అంటేనే వాట్సాప్ యూనివర్సిటీ. పార్టీ సోషల్ మీడియాలో బీజేపీ బత్తాయిలు అంటే కాషాయ కార్యకర్తలకు నెట్‌జన్లు పెట్టిన ముద్దు పేరు లెండి.. అడ్డగోలుగా అబద్దపు ప్రచారాలు చేసి , ప్రత్యర్థులపై బురద జల్లుతుంటారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్నికలలో విజయాలు సాధించడం బీజేపీ టెక్నిక్. అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియాలో బీజేపీకి సీన్ రివర్స్ అవుతోంది.
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో నెట్‌జన్లు బీజేపీకి చుక్కలు చూపిస్తున్నారు. ఎవడూ తీసిన గొయ్యిలో వాడే పడ్డట్లు అసలే మునుగోడు రణక్షేత్రంలో కోమటిరెడ్డిపై వ్యతిరేకతకు మోడీ సర్కార్ పెంచుతున్న ధరలు మరింత తోడవగా తాజాగా బండి సంజయ్ గుదిబండలా మారాడు.
యాక్సిడెంటల్‌గా ఎంపీగా గెలిచిన ఈ కార్పొరేటర్ స్ధాయి వ్యక్తి మాట్లాడే తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. సార్ ఎక్కడికెళ్లినా ఒక్కటే స్పీచ్ మత విద్వేశాలు రెచ్చగొట్టడం…ప్రజానాయకుడు సీఎం కేసీఆర్‌ను అడ్డగొలుగా తిట్టడం. ఇది తప్ప బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పిందే లేదు. రీసెంట్‌గా మసీదులను కూలగొట్టి శివం వస్తే..శవం వస్తే మీకు అంటూ ఓ మతాన్ని ఉద్దేశించి ఈ తంబాకు టిల్లు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలే సీరియస్ కాగా క్షూద్రపూజలు అంటూ నొటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడారు. బహుశా రాజకీయాల్లోకి క్షుద్రపూజలు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఈసారేనేమో. దీనిపై మంత్రి కేటీఆర్, హరీశ్ రావు సహా నేతలంతా ఆయన్ని ఎర్రగడ్డలో చూపించాలని ఆ పార్టీనేతలకు చెప్పగా తాజాగా ఇందుకు సంబంధించిన ప్లకార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొంతమంది బీజేపీ నేతలు మా నాయకుడు బండి సంజయ్‌కి ఎర్రగడ్డలో ప్రత్యేకవార్డు కేటాయించాలని ఉన్న ప్లకార్డు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇది మార్ఫింగ్ ఫోటోనే అయినా నువు నేర్పిన విద్యే కదా నీరాజాక్ష అన్నట్లు గతంలో బీజేపీ ఇతర పార్టీల నేతలపై చేసిన తప్పుడు ప్రచారం వారి మెడకే చుట్టుకుంది.