రియల్లీ అన్‌స్టాపబుల్..NBKతో బాబు,లోకేశ్‌

120
nbk
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌రావడమే హైయెస్ట్ టీఆర్పీతో టాప్‌ రేటింగ్‌లో నిలిచింది. ఇక సీజన్‌ 2 …14 నుండి ప్రారంభంకానుండగా తొలి ఎపిసోడ్ ప్రొమో అదిరిపోయింది. నిజంగానే అన్ని షోలకు బాప్‌గా చంద్రబాబు, లోకేశ్‌తో చేసిన ట్రైలర్ అదిరిపోయింది.

ఈ ప్రోమోలో చంద్రబాబును అందరికీ బాబుగారు, తనకు బావగారు అంటూ బాలయ్య ఆహ్వానించిన తీరు బాగుంది. ఇక అల్లుడు నారా లోకేశ్ హోస్ట్‌గా మారి తన తండ్రి, మామలను పలు ఆసక్తికర ప్రశ్నలు అడగ్గా.. తండ్రీ కొడుకులు కలిసి తన సంసారంలో నిప్పులు పొస్తున్నారు అంటూ బాలయ్య చేసిన కామెంట్ నవ్వులను పూయించింది. ఇక చంద్రబాబు రాజకీయ జీవితంలో పలు కీలక ఘట్టాలకు సంబంధించి కూడా ప్రశ్నలు అడగ్గా చంద్రబాబు సైతం ఆధ్యంతం నవ్వుతూ సమాధానాలు చెప్పారు.

- Advertisement -