ఎల్లో అలర్ట్…భారీ వర్ష సూచన

108
rains
- Advertisement -

తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. ఇవాళ విడుదల చేసిన వెదర్ రిపోర్ట్‌లో రాష్ట్రంలోని పశ్చిమ, ఉత్తర ప్రాంతంలో మంగళవారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

రాష్ట్రంలోని పశ్చిమ, ఉత్తర జిల్లాలకు వాతావరణ కార్యాలయం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తుపాను ప్రభావంతో తెలంగాణలో ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చే 4-5 రోజుల్లో వాయువ్య,మధ్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

- Advertisement -