అన్‌స్టాప‌బుల్.. సీబీఎన్‌తో ఎన్బీకే

85
NBK
- Advertisement -

అన్‌స్టాప‌బుల్ విత్ విత్ ఎన్‌బీకే ఆహాలో ప్రసారం అవుతున్న ఈ టాక్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త‌న‌దైన స్టైల్‌తో యాంక‌రింగ్‌కు కొత్త‌ద‌నాన్ని తీసుకొస్తూ బాలయ్య చేసిన ఈ షోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సెకండ్ సీజన్ అక్టోబర్ 14 నుండి ప్రారంభంకానుండగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

ట్రైలర్‌లో.. ఓ గుహలోని నిధిని అన్వేషిస్తూ ఓ గుహలోకి వెళతారు.. అక్కడ ఆయనకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అంధకార భయారణ్యంలో నిక్షిప్తమైన నిగూఢ నిధి అన్ ఇమేజనబుల్..అక్కడేదురయ్యే సవాళ్లు అన్ ప్రెడిక్టబుల్…అయినా ఆగని మన పోరాటం అన్‌స్టాపబుల్ అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.

గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్’’అని చెబుతూనే ఈసారి ప్రశ్నల్లో మరింత ఫైర్.. ఆటల్లో మరింత డేర్.. సరదాల్లో మరింత సెటైర్. మీ కోసం మరింత రంజుగా అంటూ అంచనాలు పెంచేశారు. సీజ‌న్ 2లో తొలి ఎపిసోడ్‌ను ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో చిత్రీక‌రించారు.

- Advertisement -