కేటీఆర్‌ మీడియాతో చిట్‌చాట్‌

88
- Advertisement -

దేశవ్యాప్తంగా 24గంటల కరెంట్‌ ఉచితంగ ఇవ్వవచ్చని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, 24గంటల ఉచితంగా కరెంటు దేశవ్యాప్తంగా విస్తరించవచ్చన్నారు. అది కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని అతి స్వల్ప కాలంలో నిరూపించిన వ్యక్తి కేసీఆర్‌ అని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ రైతు పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చన్నారు.

రైతు వేదికలు, రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవన్నారు. ఈ పథకాలతో మన రైతులు పంజాబ్‌ హర్యానా రాష్ట్ర రైతుల కంటే అధికంగా దాన్యం పండిస్తున్నామన్నారు. రైతు బంధు పథకంను కాపీ కొడుతూ వివిధ రాష్ట్రాల్లో అమలు పరస్తున్నారు అని తెలిపారు. తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అతి స్వల్ప కాలంలో అద్భుతంగా పని చేసి ధనిక రాష్ట్రంగా ఎదిగిందన్నారు.

మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇవ్వడం పెద్ద విషయమన్నారు. 75ఏళ్లలో ఎవరూ చేయని పనులను కేవలం సీఎం కేసీఆర్‌ 8ఏళ్ల కాలంలో చేశారన్నారు. తెలంగాణలో 5దశాబ్దల పాటు అపరిష్కతంగా ఉన్న ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించి…. తెలంగాణ ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా భారత ప్రభుత్వం ప్రకటించదన్నారు.

బీజేపీ, ప్రధానిపై నిప్పులు
గోల్‌ మాల్‌ గుజరాత్‌ మోడల్‌ను చూపెట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ గడిచిన 8ఏళ్లలో ఏం చేశారని మండిపడ్డారు. స్వతంత్ర భారతంలో మోస్ట్‌ ఇన్‌కాంపీటింట్‌, ఇన్‌ ఎఫిషియంట్‌, ప్రచార్‌ మంత్రిగా నరేంద్రమోదీ ఎదిగారని దుయ్య బట్టారు. మునేపెన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందన్నారు. ఇప్పుడు దేశంలో వికాస్‌ ఎక్కడ కనిపించడంలేదని అని అన్నారు. అచ్చే దిన్‌ ఆయేంగే అంటూ కేవలం ఒక్క మనిషిని మాత్రమే దునియాలో ధనవంతున్ని చేశారని విమర్శించారు.

ఆర్థిక ప్రమాద ఘంటికలు
అత్యధిక ద్రవ్యోల్భణం, అత్యధిక నిరుద్యోగం, ప్రపంచంలో అత్యధిక గ్యాస్‌ రేట్‌ మన దేశంలో ఉన్నాయన్న కేటీఆర్‌… అఫ్రికా ఖండంలోని నైజిరియా కంటే ఇండియా పూర్‌ కంట్రీగా అవుతోందని రిపోర్టులు తెలుపుతున్నాయని మంత్రి అన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందన్నారు. అన్ని రంగాల్లో  ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని మండిపడ్డారు.

భారత్ రాష్ట్ర సమితిపై కేటీఆర్‌

ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సమానం. అందుకే సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను భారత రాష్ట్ర సమితిగా మార్చరన్నారు.  కేసీఆర్‌ 8నెలల నుంచి దేశంలోని వివిధ రాజకీయ నాయకులు, రైతు సంఘాలు, ఆర్థిక వేత్తలతో మాట్లాడి జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నమన్నారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికలు మా టార్గెట్‌ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, ఇంటింటికీ తాగు నీరు, దళిత బంధు తదితర కార్యక్రమాలు దేశమంతా అమలు చేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని కేటీఆర్ చెప్పారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు జిల్లాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు మద్దతు పెరుగుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.

రాహుల్‌ జోడో యాత్ర కాదు కాంగ్రెస్‌ జోడో యాత్ర
రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర కాకుండా కాంగ్రెస్‌ జోడో యాత్ర చేపట్టాలని కేటీఆర్‌ సూచించారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు తమతో టచ్లో ఉన్నారని అన్నారు. దేశంలో కాంగ్రెస్‌ ప్రతిపక్షం కాదని దాని స్థానంలో బీఆర్‌ఎస్‌ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఫోన్‌ ట్యాపింగ్‌
ఇక దేశంలో 10వేల మంది మొబైల్ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న ఆయన.. కిషన్ రెడ్డి ఫోన్ నెంబర్ కూడా అందులో ఉందని చెప్పారు. సుజనా చౌదరి, సీఎం రమేష్పై ఉన్న కేసులు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.

మునునగోడు ఉప ఎన్నిక
మునుగోడు ఉప ఎన్నికల్లో కచ్చితంగా టీఆర్ఎస్‌ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేస్తూ… పైసల కోసమే రాజగోపాల్‌ పదవిని పణంగా పెట్టి బీజేపీలోకి పోయిండన్నారు. మునుగోడులో బీజేపీ ఓటుకు 30వేలు ఇచ్చి కొని…గెలుస్తామని ధీమాగా ఉన్నారన్న ఆయన… కాంట్రాక్టర్‌ బలుపు మాటలు తెలంగాణలో పాతర పెడతారని అని అన్నారు. మునుగోడులో గెలుపు మాదే అన్న కేటీఆర్‌…రెండు మూడు స్థానాల కోసం కాంగ్రెస్‌, బీజేపీల మధ్య గట్టి పోటి ఉంటుందన్నారు.

మతం మధ్య చిచ్చు
దేశంలో హిందూ ముస్లీంల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకుంటున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. హిందూ ముస్లీంల పొలరైజజేషన్‌ అని చిల్లర మాటలు మాట్లాడుతున్న మోహన్‌ భగవత్‌ను నమ్మవద్దని సూచించారు.

- Advertisement -