ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అంటే శోభన్‌బాబు గుర్తొస్తారు.కానీ తర్వాత తరం నటుల్లో మాత్రం జగపతి బాబు ఫ్యామిలీ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. లెజెండ్ సినిమాలో విలన్ రోల్‌తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్…ఇప్పుడు తాజాగా రుద్రంగి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమాకి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. టైటిల్ రోల్‌ను కన్నడ హీరోయిన్ పోషిస్తున్నారు. మమత మోహన్ దాస్ .. ఆశిష్ గాంధీ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా జగపతిబాబు తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్.
బండి చక్రంతో శత్రువులపై విరుచుకుపడుతూ ఈ పోస్టర్లో జగపతిబాబు కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన భీమ్ రావ్ దొర పాత్రలో కనిపించనున్నాడనే విషయాన్ని చెప్పారు. రుద్రంగి నాది అనే జగపతిబాబు డైలాగ్ తో ఈ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.