సద్దుల బతుకమ్మ.. ట్రాఫిక్‌ ఆంక్షలు

59
bathukamma saddula
- Advertisement -

ఇవాళ సద్దుల బతుకమ్మ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎల్బీస్టేడియంలో ఇవాళ నిర్వహించే సద్దుల బతుకమ్మ కార్యక్రమం నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించగా ఎల్బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్‌తో పాటు అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు భారీగా ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు.

చాపల్‌రోడ్డు, నాంపల్లి వైపు నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద మళ్లిస్తారు. ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలను ప్రెస్‌క్లబ్‌, ఫ్లై ఓవర్‌ వైపు అనుమతించరు. ఈ వాహనాలను చాపల్‌ రోడ్డులోకి ఎస్‌బీఐ వద్ద మళ్లిస్తారు.

రవీంద్రభారతి, హిల్‌పోర్టు నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు ట్రాఫిక్‌ అనుమతించరు. ఈ వాహనాలను సుజాత హైస్కూల్‌ వైపు కేఎల్‌కే బిల్డింగ్‌ ఫతేమైదాన్‌ వద్ద మళ్లిసార్తు. బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ నుంచి వచ్చే వాహనాలు బీజేఆర్‌ విగ్రహం వద్ద కుడివైపు అనుమతించరు. ఈ వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపల్‌ రోడ్డులోకి మళ్లిస్తారు.

ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌లో మళ్లిస్తారు. కింగ్‌కోఠి, బొగ్గులకుంట నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను కింక్‌కోఠి ఎక్స్‌ రోడ్స్‌లో తాజ్‌మహల్‌, ఈడెన్‌ గార్డెన్‌ రూట్‌లోకి మళ్లిస్తారు. సికింద్రాబాద్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను కర్బాలా మైదానం వద్ద బైబిల్‌ హౌస్‌, జబ్బార్‌ కాంప్లెక్స్‌, కవాడిగూడ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ ఆలయం,తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్‌ మినార్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను సచివాలం ఓల్డ్‌గేట్‌ వద్ద తెలుగుతలి ఫ్లై ఓవర్‌పైకి మళ్లిస్తారు.

- Advertisement -