- Advertisement -
తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణశాఖ సంచాలకులు నాగరత్న ఓ ప్రకటనలో తెలిపారు. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి ఉన్న తూర్పు పశ్చిమ ద్రోణి ఈ రోజు బలహీన పడినట్టు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం స్థిరంగా కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నట్టు వివరించారు. రానున్న 24గంటల్లో ఈశాన్య పరిసర ప్రాంతాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
- Advertisement -