అన్ని రకాల వసతులు, వనరులు ఉన్న ఈ దేశం వంచించబడుతోంది.. అవకాశాలు కోల్పోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ లోని ప్రతిమ మెడికల్ కళాశాల ను ప్రారంభించిన… ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.
ప్రపంచానికే అన్నపూర్ణగా ఉన్న భారతదేశంలో వ్యవసాయ రంగం కుదేలవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. దేశం అన్ని రంగాల్లో కుదేలవుతుంది.మనం ఏమరపాటుతో ఉంటే ఒక దశాబ్ద కాలంపాటు వెనుకపడిపోతాం కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు ఉన్న రాష్ట్రంకు ఒకప్పుడు ఉన్న సమైక్య రాష్ట్రంకు ఎంతో వ్యత్యాసం ఉంది. నాటి నాయకత్వం తప్పిదం వల్ల రాష్ట్రాన్ని సాధించుకునేందుకు దశాబ్దాల కాలం పట్టింది. ఇప్పుడు మనం దేశానికి ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలిచాము.
భారతదేశం ప్రపంచానికే అన్నపూర్ణ అలాంటిది ఇప్పుడు సాగు, తాగునీటి కోసం ఎదురుచూస్తున్నాము. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అన్ని రకాల వనరులు, భూములు ఉన్నాయి. అయినా ఇంకా వెనుకబాటుతనం పోలేదు. అవకాశాల కోసం ఈ దేశం వంచించబడుతుందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.