దేశంలో 24 గంటల్లో 3947 కరోనా కేసులు

38
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 3947 కరోనా కేసులు నమోదుకాగా 9 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,87,307కు చేరగా 4,40,19,095 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 39,583 యాక్టివ్ కేసులుండగా 5,28,629 మంది మరణించారు. కొత్తగా నమోదన కేసుల్లో అత్యధికంగా 1445 కేసులు కేరళలోనే ఉండగా ఇప్పటివరకు 218.18 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -