ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరిలో ఐరా వంతెనపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ట్రక్కు బస్సు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న ట్రక్కును బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 41మంది గాయాలపాలు కాగా 10మంది చనిపోయారు. గాయపడ్డ వాళ్లలో 12 మందిని లక్నోలోని ఒక ట్రామా కేర్ సెంటర్ కు పంపారు. ఇంకొంత మందికి లక్నో జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లఖీంపూర్ ఖేరి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన…ఐఏఎస్ అధికారిణి భావోద్వేగాన్నికి గురయ్యారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించిన అధికారిణి… క్షతగాత్రులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలో వారి కష్టాలను అడిగి తెలుసుకొని వైద్యులకు పలు సూచనలు జారీ చేశారు.
ప్రజలతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ ను పెంచుకున్న ఆ ఐఏఎస్ పేరు రోషన్ జాకబ్….ఈమె లఖీంపూర్ ఖేరి డివిజనల్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీన్ని చూసిన జనం ఇలాంటి ఏంపతి కలిగిన వ్యక్తులు అధికారులుగా వస్తే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందంటున్నారు.