విభజన సమస్యలపై కేంద్రం కీలక సమావేశం..

120
- Advertisement -

రాష్ట్ర విభజన అంశాలపై ఎట్టకేలకు కేంద్రం ముందడుగు వేసింది. విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ ఆద్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై ఉదయం 11 గం.లకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర హోంశాఖ అధికారులు, ఇరు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు.

ఈ సమావేశం ఎజెండాలో మొత్తం 14 అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏడు అంశాలు ఇరు రాష్ట్రాలకు చెందిన ద్వైపాక్షిక అంశాలు కాగా, మరో ఏడు ఏపీకి సంబంధించిన అంశాలు. ప్రభుత్వ కంపెనీలు-కార్పొరేషన్‌ల విభజన, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన, చట్టంలో పేర్కొనని ఇతర సంస్థల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలరీస్, ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన, బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వల బ్యాలెన్స్ విభజన.. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.

- Advertisement -