నెటిఫ్లిక్స్‌లో మెగా154!

96
- Advertisement -

ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం చిరు నటించిన గాడ్‌ఫాదర్ దసరాకు విడుదల కానుండగా తాజాగా 154వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‭ఫ్లిక్స్‭ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. . దాదాపు రూ.50 కోట్లు చెల్లించి నెట్‭ఫ్లిక్స్‭ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ని పరిశీలిస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు మెరవనున్నారు. చిరుకు జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -