- Advertisement -
కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. అన్ని ఆర్థిక అవరోధాలకు, నిరుద్యోగం, ద్రవోల్బణానికి గాడ్ ఆఫ్ యాక్ట్సే కారణమంటారని…. విశ్వగురును పొగడండి అని ట్విట్టర్లో సెటైర్లు వేశారు.
డాలర్‌తో రూపాయి మారకంవిలువ నానాటికీ పడిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రూపాయి విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోతున్న వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫొటో వెతుకుతూ బిజీగా ఉన్నారన్నారు. రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
- Advertisement -